Visakhapatnam: విశాఖలో హిడెన్‌స్ప్రౌట్స్ స్కూల్ కూల్చివేత వ్యవహారంపై రాజకీయ దుమారం
Visakhapatnam: విశాఖలో హిడెన్‌స్ప్రౌట్స్ స్కూల్ కూల్చివేత వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.
Visakhapatnam: విశాఖలో హిడెన్‌స్ప్రౌట్స్ స్కూల్ కూల్చివేత వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. మానసిక దివ్యాంగుల పాఠశాలను అమానుషంగా కూల్చివేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మానసిక దివ్యాంగుల పాఠశాలకు సాయం చేయాల్సింది పోయి కూల్చివేయడం ఏంటని అన్ని వర్గాల ప్రజల నుంచి సర్వత్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
దివ్యాంగ విద్యార్థుల కోసం సేవాభావంతో, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న పాఠశాలను మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. స్కూల్‌ను మూసివేయించడంపై తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని మానసిక దివ్యాంగులైన చిన్నారులను అక్కున చేర్చుకుని, చదువుతో పాటు ఆటపాటలు నేర్పించే పాఠశాలను నేలమట్టం చేయడం సరైన నిర్ణయం కాదని వాపొతున్నారు.
మానసిక దివ్యాంగులైన తమ పిల్లలకు విద్యాబోధనతో పాటు ఆటపాటలు, సంగీతం నేర్పిస్తున్న పాఠశాలను జీవీఎంసీ అధికారులు ఆకస్మికంగా కూల్చివేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థుల పట్ల ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలుగు మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై మాజీ భారత క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. హిడెన్ స్ప్రౌట్స్ ని కూల్చివేయ్యడం సరికాదని అసహానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి మానసిక దివ్యాంగులను ఆదుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు.