బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాగల 48 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం
Weather Report: కోస్తాతో సహా పలు జిల్లాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం
Weather Report: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న 48 గంటల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, ఇవాళ, రేపుతేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఆదివారం వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయసీమలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాయలసీమలో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.