మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్
Chandrababu: అక్టోబర్ 4న ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
Chandrababu: ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఐటం నెంబర్ 42గా కేసు లిస్ట్ అయ్యింది. కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని.. కేసు కొట్టివేయాలని రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని.. అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకు ఇచ్చామంటుంంది తెలంగాణ ప్రభుత్వం.
ఓటుకు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017లో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆయన.. తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు.