Ganja seized in Eluru: ఏలూరు ఆశ్రం జంక్షన్ వద్ద గంజాయి పట్టివేత.. ఆరుగురు నిందితుల అరెస్టు, కారు సీజ్.
Ganja seized in Eluru: నర్సీపట్నంనకు సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
Ganja seized in Eluru: నర్సీపట్నంనకు సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమచారం మేరకు వీరు ఆశ్రమ్ జంక్షన్ కు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, కారులో ఎగుమతి చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 32 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఏలూరు రూరల్ సీ ఐ అనసూరి శ్రీనివాస రావు అద్వర్యంలో ఆదివారం మద్యాహ్నం ఆశ్రం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచున్న ఏలూరు రూరల్ ఎస్ఐ విశాఖపట్నం నుండి వస్తున్న రెండు కార్లను ఆశ్రం జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని సోదా చేయగా అందులో 16 మూటలు గా కట్టిన సుమారు 400 కేజీల గంజాయిని,గుర్తించడమైనది. కారులో ప్రయాణిస్తున్న రాజస్తాన్ కి చెందిన హర్ఫుల్ జాట్ అనే వ్యక్తీ ని అదుపులోకి తీసుకొని విచారించగా, తను ఈ గంజాయిని నర్సీపట్నంలో కొనుగోలు చేసి, పోలీసులకు అనుమానం రాకుండా, ఆయా కార్లల్లో మహిళలను కూడా ఎక్కించి తీసుకోస్తునట్లు చెప్పాడు. తను ఈ గంజాయిని విసన్నపేట మరియు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తానని చెప్పాడు. రెండు కార్లను తనిఖీ చేసి, 25 కేజీలు చొప్పున ప్యాక్ చేసిన 16 బస్తాలను, రెండు సెల్ ఫోన్ లను, రెండు కార్లను సీజ్ చేయడమైనది.