ఏపీలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నట్టుగానే నాలుగుస్థానాలు వైసీపీ కైవసం అయ్యాయి. వైసీపీ అభ్యర్థులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ , పరిమళ్ నత్వాని విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే రావడంతో.. ఆయన ఓటమిపాలయ్యారు. గెలుపొందిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 38 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థులకు మొత్తంగా 152 ఓట్లు వచ్చాయి.
ఇక మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో 173 మంది ఓటింగ్ కు హాజరయ్యారు. అయితే ఇందులో నలుగురి ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఆ చెల్లని ఓట్లు కూడా టీడీపీ సభ్యులవే కావడం విశేషం. ఇందులో కూడా ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి ఉన్నారు. అలాగే మరొక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు కూడా చెల్లలేదు. ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం వైసీపీ అభ్యర్థికే ఓటు వేశారు.