Visakhapatnam: విశాఖ జిల్లాలో కాల్పుల కలకలం
Visakhapatnam: టాస్క్ ఫోర్స్ పోలీసులు, గ్రామస్తుల మధ్య వివాదం
Visakhapatnam: విశాఖ జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, గ్రామస్తుల మధ్య వివాదం దాడికి దారితీసింది. చింతపల్లి మండలం ఘాట్ రోడ్డులో బాలకృష్ణ అనే వ్యక్తి ఆచూకీ కోసం మరో వ్యక్తిని టాస్క్ పోర్స్ పోలీసులు తీసుకు వచ్చారు. అన్నవరం గ్రామస్తులు ఎక్కువ మంది రావడంతో వెనుదిరిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులను వెంబడించారు. మార్గ మధ్యలో లారీ అడ్డురావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిలిచిపోయారు. గ్రామస్తులు ఒక్క సారి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రామస్థులతో పాటు కొంతమంది స్మగ్లర్లు గాయపడ్డారు. గాయపడిన గ్రామస్థులను నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.
విశాఖ ఏజెన్సీలో కాల్పుల కలకలం రేగింది. ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో గంజాయి స్మగ్లర్ల కోసంగాలిస్తున్న నల్లగొండ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులుపై రాళ్లదాడి చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులతో గంజాయి స్మగర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కామరాజు , రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఏవోబీ లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.