AP: ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Update: 2025-04-04 03:06 GMT

AP: శుక్రవారం తెల్లవారుజామున ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది భనవంలోని 2వ బ్లాక్ లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే బిల్డింగ్ లోని 2వ బ్లాక్ లో పవర్ బ్యాక్ అప్ కోసం బ్యాటరీలు స్టోర్ చేసే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది ఇప్పటికే దర్యాప్తును చేపట్టారు. 

Tags:    

Similar News