వారంతా సమాజానికి తిరిగి ఇవ్వాలి - ఉగాది వేడుకల్లో చంద్రబాబు

Update: 2025-03-30 12:09 GMT

వారంతా సమాజానికి తిరిగి ఇవ్వాలి - ఉగాది వేడుకల్లో చంద్రబాబు

Chandrababu Naidu speech in Ugadi awards 2025 event: సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం నిర్మూలన కోసం, పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మకు సార్దకత చేకూరుతుంది అని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో మెరుగైన సేవలు అందించిన వారికి ఆయన ఉగాది పురస్కారాలు అందించారు. రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలు వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. వాట్సాప్ గవర్నన్స్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించేందుకు కృషి చేసే బాధ్యత తనది అని చంద్రబాబు అన్నారు.

20 ఏళ్ల క్రితం తను ఐటి రంగం ప్రాధాన్యత గురించి చెప్పినప్పుడే అటు వెళ్లిన వారు బాగా స్థిరపడ్డారని చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటే సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉన్నత స్థానాలకు వెళ్లిన తరువాత తిరిగి సమాజానికి ఏదో ఒక రకంగా సాయపడాలని సూచించారు. 

Tags:    

Similar News