AP Inter Results 2025: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇలా చెక్ చేసుకోండి..!
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి.

AP Inter Results 2025: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇలా చెక్ చేసుకోండి..!
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈనెల 12 లేదా 13వ తేదీల్లో పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ నిర్వహించగా.. రెండో సంవత్సరం ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ నెలలోనే రానున్నాయి.
ఇక విద్యార్థులకు పరీక్ష ఫలితాలు తెలుసుకునేందుకు మల్టిపుల్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా bieap.gov. in అధికారిక వెబ్సైట్లో సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీలో APIPE పరీక్ష ఫలితాలు 2025 లింక్ పై క్లిక్ చేయాలి. ఇందులో మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఎంపిక చేసుకొని అందులో హాల్ టికెట్ నెంబర్ లేదా విద్యార్థి పుట్టిన తేదీని ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ ముందు పరీక్ష ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఫలితాలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకునే విధానం..
వాట్సాప్ ద్వారా ఇంటర్ పరీక్ష ఫలితాలు తెలుసుకునే విధానాన్ని ఈ ఏడాది అమల్లోకి తేనుంది. దీనికి మీ వాట్సాప్ ద్వారానే నేరుగా ఏపీ గవర్నమెంట్‌కు 'Hi' అని 9552300009 కి మెసేజ్ చేయాలి.
ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 ఎంపిక చేసుకోవాలి అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు మీ ముందు ఫలితాలు కనిపిస్తాయి. వెంటనే సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SMS ద్వారా ఇంటర్ పరీక్ష ఫలితాలు తెలుసుకునే విధానం..
ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు. దీనికి సింపుల్ గా 'APGEN1', OR 'APGEN2' స్పేస్ ఇచ్చిన తర్వాత రోల్ నెంబర్ ఎంటర్ చేసి 5626 నంబర్‌కు మెసేజ్ పంపాలి. అప్పుడు వెంటనే రిజల్ట్స్ మీ ముందు కనిపిస్తాయి. దీనికి హాల్ టికెట్ నెంబర్ తప్పనిసరి తద్వారా సులభంగా మీ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.