Medicine career: తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవాలనుకుంటున్నారా? ఇలా చేయండి!
Medicine career: ఫిలిప్పీన్స్ తక్కువ ఖర్చుతో మెడికల్ చదివే అవకాశం కల్పిస్తూ, భారతీయ విద్యార్థులకు గొప్ప మార్గంగా మారుతోంది.
Medicine career: తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవాలనుకుంటున్నారా? ఇలా చేయండి!
Medicine career: విదేశాల్లో తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫిలిప్పీన్స్ గొప్ప అవకాశం అందిస్తోంది. భారత్‌లో మెడికల్ సీటు పొందడం చాలా మంది విద్యార్థులకు కష్టసాధ్యమైన విషయం. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఎక్కువగా ఉండటంతో, విదేశాల్లో చీప్ అండ్ క్వాలిటీతో కూడిన వైద్య విద్య అందించే మార్గాలను చాలా మంది అన్వేషిస్తున్నారు.
ఫిలిప్పీన్స్ భారతీయ విద్యార్థులకు మెడికల్ చదవటానికి సులభమైన మార్గాన్ని అందిస్తోంది. ఈ దేశం భారతీయ విద్యార్థులను స్వాగతిస్తూ, తక్కువ ఖర్చుతో మెడికల్ విద్యను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉండటంతో, విద్యార్థులు మంచి మెడికల్ శిక్షణ పొందేందుకు ఇది అద్భుతమైన కేంద్రంగా మారింది.
భారత్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదవాలంటే రూ. 70 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, ఇతర ఖర్చులు అన్నీ ఉన్నాయి. అయితే, ప్రతి ఒక్కరికీ ఈ స్థాయి ఖర్చు భరించడం సాధ్యపడదు. ఫిలిప్పీన్స్‌లో MBBS, MD ఇంటర్న్‌షిప్ మొత్తానికి రూ. 35-40 లక్షల మధ్యనే ఖర్చు అవుతుంది. అంటే ఇండియాతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువ ఖర్చుతో మెడికల్ చదివే అవకాశాన్ని అందిస్తోంది. విద్యార్ధులు తక్కువ ఖర్చుతో నాణ్యతైన వైద్య విద్యను పొందే అవకాశం కలుగుతుంది.