Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలు, ఖాళీల వివరాలు ఇవే

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. అర్హతలు, ఖాళీల వివరాలు ఇవే
Indian Navy Recruitment: ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామకానికి ఆన్ లైన్ దరఖాస్తులు భారత నావికాదళ అధికారిక వెబ్ సైట్ www.joinindiannavy.gov.inలో ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశించిన చివరి తేదీకి ముందు ఫారమ్ ను దరఖాస్తు చేసుకోవచ్చు. నేవీ ఆఫీసర్ కావడానికి అవసరమైన అర్హతలేంటో చూద్దాం.
ఇండియన్ నేవీలో చేరాలని కలలు కంటున్న అభ్యర్థులకు కోసం కొత్త రిక్రూట్ మెంట్ వెలువడింది. ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ జనవరి 2026 కింద ఆఫీసర్ స్థాయి ఖాళీలను రిలీజ్ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం అయ్యింది. దీనిలో అర్హత గల అభ్యర్థులు 25 ఫిబ్రవరి 2025 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
భారత నావికాదళం ఈ నియామకాలు టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ , ఎగ్జిక్యూటివ్ బ్రాంచుల్లో విడుదల చేసింది. ఏ బ్రాంచ్ కేడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 60, పైలట్ 26, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ 22, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, లాజిస్టిక్స్ 28, ఎడ్యుకేషన్ బ్రాంచ్ 15, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ 45, నావల్ కన్స్రక్టర్ 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 270 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది.
ఈ నేవీ ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో పోస్టు ప్రకారం BE/BTech, డిగ్రీ, MBA/BSc/B.Com/ఎంసీఏ/ఎంఎస్సీ మొదలైన డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల తర్వాత షార్ట్ లిస్టింగ్ కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక కూడా జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను జాగ్రత్తగా నింపాలి. ఎందుకంటే ఒకసారి ఫారమ్ నింపిన తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయలేరు.