MBBS: డాక్టర్‌ కావాలనుకునే వారికి కేంద్రం గుడ్‌ న్యూస్‌.. మెడికల్ సీట్లపై కీలక అప్‌డేట్!

MBBS: ప్రభుత్వ దృష్టి కేవలం మెడికల్ సీట్లు పెంచడంలోనే కాదు, భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.

Update: 2025-04-06 04:00 GMT
MBBS

MBBS: డాక్టర్‌ కావాలనుకునే వారికి కేంద్రం గుడ్‌ న్యూస్‌.. మెడికల్ సీట్లపై కీలక అప్‌డేట్!

  • whatsapp icon

MBBS: భారత్‌లో ఆరోగ్య సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొనడానికి కేంద్ర ప్రభుత్వం మెడికల్ విద్యలో భారీ మార్పులు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 60,000 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,18,190 ఎంబీబీఎస్ సీట్లు, 74,306 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 13 లక్షలకుపైగా ఆలోపతి వైద్యులు నమోదు కాగా, ఆయుష్ వైద్యుల సంఖ్య కూడా 7.5 లక్షలకు చేరుతోంది. వీరిలో సగటున 80 శాతం మంది యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. దాంతో పాటు దేశంలోని జనాభాతో పోలిస్తే డాక్టర్‌-ప్రజల నిష్పత్తి సుమారుగా 1:811గా ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో మెడికల్ విద్యను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రణాళికను రూపొందించింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 157 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వగా, వాటిలో 131 పూర్తిగా పనిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచి మెడికల్ సీట్ల సంఖ్యను పెంచే కార్యక్రమాలు అమలవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 75 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వాటిలో 71 పూర్తయ్యాయి.

ఆయుష్మాన్ భారత్ పథకాల కింద, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. వైద్య విద్యార్థులను గ్రామీణ కుటుంబాలకి అనుసంధానించే విధంగా 'ఫ్యామిలీ అడాప్షన్' విధానం ప్రారంభించారు. పీజీ విద్యార్థులను జిల్లాల ఆసుపత్రుల్లో పనిచేయించే విధానం ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక వేతనాలు, వసతి ప్రోత్సాహకాలు వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ఇంకా రాష్ట్రాలకు వారి అవసరాలను బట్టి వైద్యులను నియమించుకునే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. దీని ద్వారా "నువ్వే రేటు చెప్పు - మేమే చెల్లిస్తాం" అనే విధానాన్ని పాటించేందుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా నైపుణ్యం గల వైద్యులను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. మరోవైపు, నిరంతర శిక్షణలు, బహుళ నైపుణ్యాల మెరుగుదల ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవల ప్రమాణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Tags:    

Similar News