india post: నిరుద్యోగులకు భారీ శుభవార్త..21,413పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

Update: 2025-02-25 04:18 GMT
india post: నిరుద్యోగులకు భారీ శుభవార్త..21,413పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఉద్యోగం
  • whatsapp icon

India POST GDS Recruitment 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇప్పుడు మీకు ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు. మీరు ఎలాంటి పరీక్ష లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే ఏకంగా 21వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత తపాల శాఖలో 21413 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 3. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇండియా పోస్ట్ అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ మొత్తం 21413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఉద్యోగాలకు విడుదల చేసింది. ఎలాంటి వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండానే భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుకు ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఎంటంటే ఈ నియామకానికి 10వ తరగతి పాస్ అయితే చాలు.

మీరు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను indiapostgdsonline.gov.inద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 3. చివరి తేదీ వరకు వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఇండియా పోస్టు జీడీఎస్ రిక్రూట్ మెంట్ కోసం వయోపరిమితిని కూడా నిర్ణయించింది. దీనికింద దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 40ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇండియా పోస్టులో గ్రామీణ సేవక్ పోస్టుల కోసం నియామకాలు చేపట్టారు. యూపీ సర్కిల్ లో 3004 పోస్టులకు ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉంటాయి. మధ్యప్రదేశ్ లో మొత్తం 1314 ఖాళీలు ఉన్నాయి. బీహార్ లో 783, చత్తీస్ గఢ్ లో 638 ఖాళీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలోనూ 519 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.


Tags:    

Similar News