EKYC: రేషన్ కార్డుదారులకు శుభవార్త..ఈకేవైసీ గడువు పెంపు..ఎప్పటి వరకు అంటే ?
EKYC
EKYC: రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాల శాఖ ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించింది. తొలుత ఈ నెల 31 వరకే సమయం ఉందని అధికారులు చెప్పినా ఇంకా 1.50లక్షల మంది మిగిలిపోయారు. చాలా మందిలో సందేహాలు ఉండటం, ప్రస్తుత పరీక్షల కారణంగా పిల్లలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం అనివార్యమైంది.
రేషన్ కార్డులబ్దిదారులు ఈ కేవైసీ నమోదు చేయించాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎవరెవరు చేయించుకోవాల్సి ఉందో ఆ వివరాలను అధికారులు, డీలర్లు, సచివాలయాల సిబ్బందికి పంపించారు. ప్రతీ సచివాలయం పరిధిలో కార్డుదారులకు మ్యాపింగ్ చేశారు. ఒక దుకాణం పరిధిలో ఉన్నవారిని వేరే దుకాణానికి మార్చారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం లబ్దిదారులు ఆయా సచివాలయాల పరిధిలోనే ఉంటారని భావించారు. తీరా చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఫోన్ నెంబర్లు లేకపోవడంతో ఈకేవైసీ పూర్తి అవ్వలేదు. గత వైఎస్సారీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రక్రియ పట్టించుకోలేదు.