Nakka Anand Babu: 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏం చేశారో సీఎం చెప్పాలి
Nakka Anand Babu: జగన్ సర్కార్ పై టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మండిపడ్డారు.
Nakka Anand Babu: జగన్ సర్కార్ పై టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మండిపడ్డారు. వైసీపీకి 51 శాతం ఓట్లు వేసి ప్రజలు అధికారంలోకి తెచ్చారని, మిగిలిన 49 శాతం మందిని జీవించే అధికారం లేకుండా చేయాలని కాదని విమర్శించారు. వైసీపీ మద్దతుదారులకే తప్ప మిగిన వారికి ప్రభుత్వ పధకాలు వర్తించడంలేదరి ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. డెల్టా ప్రాంతం లో మొక్కజొన్న ,జొన్న కోనుగోలు చేసే వారు లేరు. ప్రభుత్వ కనీస మద్దతు ధర ఎక్కడా ఉంది...? రైతుల పంట ప్రభుత్వం ఎక్కడ కొంటున్నారో చెప్పాలన్నారు. 3వేల కోట్ల ధరల స్దరీకరణ నిధి ఏం చేశారో జగన్ బహిరంగ పరచాలని వివరించారు.
నేరుగా రైతుల నుంచే పంట కోనుగోలు చేస్తున్నామని జగన్ చెప్పడం సిగ్గుచేటు అని నక్కా అనందబాబు చెప్పారు. రైతుల నుంచి వైసీపీ నేతలు కమిషన్ లు వసూలు చేసి పంట కొనుగోలు చేస్తున్నారని ఆరోపింంచారు. ఇప్పటి వరకు కేవలం 22 శాతం మాత్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేశారని, కౌలు రైతులు అన్యాయం అయిపోతున్నారని ఆయన వాపోయారు.\ పంటల భీమా , సున్నా వడ్డీ అంతా మోసం, రైతులకు ఆధునిక .యంత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు నుంచి ఎంత పంట కొనుగోలు చేశారో కలెక్టర్ ప్రకటన చేయాలి. రైతులు పంట తక్షణమే కోనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు.