Raghavamma: మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి భార్య కన్నుమూత
Raghavamma:గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Raghavamma: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి.. సతీమణి రాఘవమ్మ (97) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ సోమాజిగూడలోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
కాసు రాఘవమ్మ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాఘవమ్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.