Eluru Traffic Police: వైరస్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ట్రాఫిక్ పోలీసులు
Eluru Traffic Police: వాళ్లు రోడ్డెక్కితేనే ట్రాఫిక్ మాట వింటుంది. వాళ్లు కనబడితే బైక్ కంట్రోల్ అవుతోంది. స్పీడ్ అదుపులో ఉంటుంది. వాళ్లు లేరు..! ఇక రారు..! అనుకుంటే వేగం పెరుగుతోంది.
Eluru Traffic Police: వాళ్లు రోడ్డెక్కితేనే ట్రాఫిక్ మాట వింటుంది. వాళ్లు కనబడితే బైక్ కంట్రోల్ అవుతోంది. స్పీడ్ అదుపులో ఉంటుంది. వాళ్లు లేరు..! ఇక రారు..! అనుకుంటే వేగం పెరుగుతోంది. అదుపు తప్పి ప్రాణం పోతోంది. ఇంతకి వాళ్లెవరో ఇప్పటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది. వైట్ షర్ట్, ఖాకీ ఫ్యాంట్ ధరించి.. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. వాళ్లకు కూడా కరోనా కాటు తప్పలేదు. అయితే మనోదైర్యంతో విజేతలుగా మారి.. అనేక మందిలో ధైర్యం కల్గిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ ట్రాఫిక్ పోలీస్టేషన్ లో పనిచేస్తున్న 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జిల్లాలో కలకలం రేపింది. ఏలూరులోని వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వరరావుకు, సిబ్బందికి జూలై 5న కరోనా నిర్ధారణ అయింది. అయితే ఎస్సై వెంకటేశ్వరరావుకు పాజిటివ్ వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మనోదైర్యంతో వారం రోజుల్లో కరోనాను జయించి... ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఏలూరులోని ఆముదాల అప్పలస్వామి కాలనీకి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్గా కృష‌్ణ ప్రసాద్‌కు... జూలై 30న కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆందోళన,.. భయం.. కుంగదీస్తున్నా .. మనోధైర్యం కోల్పోలేదు. కృష్ణ ప్రసాద్ మనో నిబ్బరంతో కరోనాను జయించి విధులు నిర్వహిస్తున్నాడు. ఇలా ఏలూరులో ట్రాఫిక్ సిబ్బందికి కరోనా సోకినా దైర్యంగా నిలబడ్డారు. కుటుంబ సభ్యుల్లో మనోదైర్యం నింపారు. కరోనాను జయించి.. బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.