Andhra Pradesh: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

* ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ * కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీలకు పోలింగ్

Update: 2021-11-15 02:12 GMT

నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఆంధ్రదప్రదేశ్‌లో నెల్లూరు నగరపాలక సంస్థ సహా పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్‌ను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగ. వీటిలో 28 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 325 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఆయా స్థానాలకు వైసీపీ, టీడీపీ, బీజేపీ సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది పోటీ పడుతున్నారు.

908 పోలింగ్‌ కేంద్రాల్లో 8.62 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాల్లో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైనవిగా గుర్తించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు, వెబ్‌ కాస్టింగ్‌ చేపడుతున్నారు.

Tags:    

Similar News