Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక
Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రి వైద్యులు కీలక నివేదిక వెల్లడించారు.
Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రి వైద్యులు కీలక నివేదిక వెల్లడించారు. చంద్రబాబుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్‌లో వైద్యులు తెలిపారు. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారించారు. తీవ్రమైన ఎండల కారణంగా చంద్రబాబు కొద్దిరోజులుగా డిహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలని వైద్యులు నివేదికలో స్పష్టంగా తెలిపారు.