శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నడక దారి భక్తులకు త్వరలో టోకెన్లు..

TTD Board Meeting: టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించారు.

Update: 2022-04-30 15:30 GMT

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నడక దారి భక్తులకు త్వరలో టోకెన్లు..

TTD Board Meeting: టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నడకదారి భక్తులకు దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు.

టీటీడీ నిర్ణయాలు...

*టైం స్లాట్‌ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని టీటీడీ నిర్ణయం.

* నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియ.

* తిరుమల బాలాజీనగర్‌ వద్ద 2.86 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్‌ బస్‌ స్టేషన్‌ ఏర్పాటు.

* శ్రీవారి మెట్టుమార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి.

* శ్రీనివాస సేతు రెండోదశ పనులకు రూ.100కోట్లు కేటాయింపు.

* టీటీడీ ఉద్యోగుల వసతి గృహాల ఆధునికీకరణకు రూ.19.40కోట్లు.

* ఇకపై వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News