అమరావతికి లైన్ క్లియర్.. ఊపందుకున్న రాజధాని పనులు

Amaravathi: ఓవైపు కోర్టు తీర్పు మరో వైపు శాసన రాజధానిగా అమరావతి నేపథ్యంలో సర్కారులో కదలిక వచ్చింది.

Update: 2022-05-04 15:00 GMT

అమరావతికి లైన్ క్లియర్.. ఊపందుకున్న రాజధాని పనులు

Amaravathi: ఓవైపు కోర్టు తీర్పు మరో వైపు శాసన రాజధానిగా అమరావతి నేపథ్యంలో సర్కారులో కదలిక వచ్చింది. రాజధాని పనులను సర్కారు వేగవంతం చేస్తోంది. దాదాపు మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న రాజధాని పనుల్లో ఊపు కన్పిస్తోంది. అమరావతి రాజధాని అంటూ గత సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వైసీపీ సర్కారు త్రీ క్యాపిటల్స్‌ ప్లాన్ ఆవిష్కరించడంతో ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యింది. ఆ తర్వాత రైతుల ఆందోళనలు, కోర్టు తీర్పులతో మొత్తం వ్యవహారం న్యాయపరిధిలోకి వెళ్లిపోయింది. ఐతే తాజాగా రాజధానిలో పనులు ప్రారంభించాలని రైతులకు ప్లాట్స్ ఇవ్వమని ఏపీ హైకోర్టు జగన్ సర్కారును ఆదేశించింది.

త్వరలో త్రీ కేపిటల్ బిల్లు అసెంబ్లీ ముందుకు తెస్తామంటూ జగన్ సర్కార్ తెచ్చి అమరావతి పనులను వేగవంతం చేస్తామంటోంది సర్కారు. 70 శాతం పూర్తయిన నిర్మాణ పనులపై సర్కార్ దృష్టిసారించింది. ఎమ్మెల్యే, మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఐతే రైతులు మాత్రం సర్కారు తీరును ఆక్షేపిస్తున్నారు. హైకోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వం చేతల్లో చూపించడం లేదని రైతులు మండిపడుతున్నారు. రాజధానిపై శాసనసభలో ప్రభుత్వం చెప్పిన అంశాలతో రైతులు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. మొత్తంగా అమరావతి విషయంలో తాము వెనక్కి తగ్గడం లేదన్న సంకేతాలిచ్చేలా జగన్ సర్కారు సైతం తాజాగా అమరావతి పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. 

Full View


Tags:    

Similar News