శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తులు.. కార్తీకమాసం మూడో సోమవారం కావడంతో పెరిగిన రద్దీ

* మల్లన్న దర్శనానికి క్యూలైన్‌లో బారులు తీరిన భక్తులు.. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం

Update: 2022-11-14 04:31 GMT

శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తులు

Karthika Masam: శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకపౌర్ణమి మూడో సోమవారం కావడంతో మల్లన్నఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. మల్లికార్జునస్వామి దర్శనానికి వేలాదిమంది క్యూలైన్‎లో వేచివున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పడుతోంది. భక్తుల శివనామస్మరణతో శ్రీశైలం ముక్కంటి క్షేత్రం మారుమోగుతోంది.

Tags:    

Similar News