Corona Updates in AP: ఏపీలో కరోనా ఉధృతి.. ఒక రోజులో 10,820 పాజిటివ్ కేసులు
Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. అటు కరోనా కు బలైన సంఖ్య 2వేలు దాటింది.
Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. అటు కరోనా కు బలైన సంఖ్య 2వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,097 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 87,112 మంది చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికి వరకు 24,87,305 మందికి కరోనా పరీక్షలు చేశారు.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1543మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు 1399, పశ్చిమ గోదావరి 1132, విశాఖపట్నం 961, గుంటూరు 881, అనంతపురం 858, చిత్తూరు 848, కడప 823, నెల్లూరు 696, శ్రీకాకుళం 452, కృష్ణా 439, ప్రకాశం 430, విజయనగరం 358 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో ఏపీలో 97 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనాకు బలైనవారి సంఖ్య 2036కి పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 12, ప్రకాశం 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి 10, అనంతపురం 8, కడప 8, శ్రీకాకుళం 8, కర్నూలు 7, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, కృష్ణా 4, నెల్లూరు 4, విజయనగరంలో ముగ్గురు చనిపోయారు.