Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,846 పాజిటివ్ కేసులు నమోదు..
Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,846 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,511 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,846 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,628 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం 10, చిత్తూరు 09, అనంతపురం 06, తూర్పుగోదావరి 06, కృష్ణా 06, కడప 05, విశాఖపట్నం 05, గుంటూరు 04, నెల్లూరు 04, విజయనగరం 04, పశ్చిమగోదావరి 04, కర్నూల్ 03, శ్రీకాకుళం జిల్లాలో 033 చొప్పున మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,83,925. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,041. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,86,531కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 92,353 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 45,99,826 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.
ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 79,643, కర్నూల్ జిల్లా 52,280, అనంతపురం జిల్లా 50,088, పచ్చిమ గోదావరి జిల్లా 52,520, చిత్తూర్ జిల్లా 50,718, విశాఖపట్నం జిల్లా 44,912, గుంటూరు జిల్లాలో 46,645, నెల్లూరు లో 44,950, కడప 37,152, ప్రకాశం జిల్లాలో 37,865, శ్రీకాకుళం జిల్లాలో 33,425, విజయనగరం 28,958, కృష్ణ జిల్లా 21,873 కేసులు నమోదయ్యాయి.