Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,147 కేసులు..
Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,114 సాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,114 సాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 2,380 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో 11, కృష్ణ జిల్లా 09, కర్నూల్ 08, శ్రీకాకుళంలో 07, పచ్చిమ గోదావరి 05, గుంటూరు లో 03, విశాఖపట్నం 03,విజయనగరం 01, చిత్తూరు 01, ప్రకాశంలో 01 మరణించారు.
నేటి వరకు రాష్ట్రంలో 15,41,993 సాంపిల్స్ ని పరీక్షించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 80,858 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 933 మంది మరణించారు. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 39,990 యాక్టివే కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 39,935 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విదుల చేసింది.
ఇక దేశవ్యాప్తంగా చుసుకున్నట్లు అయితే, కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,310 కేసులు నమోదు కాగా, 740 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 34,602 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 12,87,945 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,40,135 ఉండగా, 8,17,208 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 30,601 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,52,801 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,54,28,170 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.