Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,895 పాజిటివ్ కేసులు..
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి..
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 7,895 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,53,111కు చేరుకుంది.. ఇందులో 89,742 యాక్టివ్ కేసులు ఉండగా, 2,60,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 92 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 3,282కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 46,712 శాంపుల్స్ ను పరీక్షించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
నెల్లూరులో 16, పచ్చిమ గోదావరిలో 13, చిత్తూరులో 11, కర్నూలులో 10, ప్రకాశం జిల్లాలో 09, కడప 08, శ్రీకాకుళం 06, విశాఖపట్నం 05, తూర్పుగోదావరి 04, అనంతపురం 03, గుంటూరు 03, కృష్ణా 03, విజయనగరంలో 02 మరణించారు. ఇక జిల్లాల పరంగా కేసులును చూసుకుంటే.. నాలుగు జిల్లాలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.. తూర్పు గోదావరి జిల్లాలో 1256, పచ్చిమ గోదావరి జిల్లాలో 671, అనంతపురం 466, గుంటూరులో 507, కడపలో 448, కృష్ణా జిల్లాలో 142, కర్నూల్ 685, నెల్లూరులో 985, ప్రకాశంలో 923, శ్రీకాకుళంలో 227, విశాఖపట్నంలో 451, విజయనగరంలో 200 కేసులు వచ్చాయి..