Coronavirus updates in AP: ఏపీలో కరోనా ఉధృతి.. కొత్తగా 10,167 పాటిజివ్ కేసులు
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,30,557 కి చేరింది. గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరింది. గత 24 గంటల్లో 4,618మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 600024కు చేరింది. మరో 69252మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1441, కర్నూలు జిల్లాలో 1252, విశాఖపట్నం జిల్లాలో 1223, పశ్చిమగోదావరి జిల్లాలో 998, అనంతపురం జిల్లాలో 954, గుంటూరు జిల్లా 946, కడప జిల్లాలో 753, నెల్లూరు జిల్లాలో 702, శ్రీకాకుళం జిల్లాలో 586, చిత్తూరు జిల్లాలో 509, ప్రకాశం జిల్లాలో 318, కృష్ణా జిల్లాలో 271, విజయనగరం జిల్లా 214 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19180 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 15723కు చేరాయి. గుంటూరు జిల్లాలో 13762 కేసులు ఉన్నాయి.