Lock Down in Tirupati: ఆగష్టు 31 వరకు తిరుపతిలో లాక్ డౌన్..

Lock Down in Tirupati: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో చిత్తూర్ జిల్లా తిరుపతిలో ఆగష్టు 31 వరకు లాక్ డౌన్ విధిస్తునట్లు అధికారులు ప్రకటించారు.

Update: 2020-08-16 11:03 GMT

Lock Down in Tirupati: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో చిత్తూర్ జిల్లా తిరుపతిలో ఆగష్టు 31 వరకు లాక్ డౌన్ విధిస్తునట్లు అధికారులు ప్రకటించారు. శనివారం అధికంగా 959 పాజిటివ్ కేసులు.. 10 మరణాలు సంభవించాయి. అయితే, లాక్ డౌన్ అంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చిన అధికారులు ఉదయం నుంచి సాయంత్రం గంటల వరకు షాపులు తెరుచుకోనేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీశ ఆదేశాలు జరీ చేసారు.   

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా శనివారం 8,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 2,81,817 కి చేరుకుంది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా కరోనాతో మరో 87 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 2,562 కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా శాంపుల్స్ ని పరీక్షించారు. ఇక ఇప్పటివరకూ రాష్ట్రంలో 28,12,197 కరోనా టెస్టులను నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.. ఇక జిల్లాల వారిగా కరోనా లెక్కలు చూసుకుంటే.. అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1126 కేసులు నమోదు అయ్యాయి.. అనంతపురంలో 851, చిత్తూరు లో 959, గుంటూరు 609, కడపలో 389, కృష్ణా జిల్లాలో 298, కర్నూలు జిల్లాలో 734, నెల్లూరు 572, ప్రకాశంలో 489, శ్రీకాకుళంలో 638, విశాఖపట్నంలో 894, విజయయనగరంలో 561, వెస్ట్ గోదావరి జిల్లాలో 612 కేసులు నమోదు అయ్యాయి.  

Tags:    

Similar News