ఏపీలో కరోనా యాక్టీవ్ కేసులు ఏ జిల్లాలో ఎన్నంటే..

ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నాలుగువందల కు పైగా కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-06-21 07:55 GMT

ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నాలుగువందల కు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,451 శాంపిల్స్ ను పరీక్షించగా 439 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7059 కు చేరింది. అలాగే కొత్తగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూల్ లో ఒకరు, చిత్తూర్ లో ఒకరు మరణించారు. దాంతో మరణాల సంఖ్య 106 కు చేరింది. ఇక శనివారం మరో 150 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలోని నమోదైన మొత్తం 7059 పాజిటివ్ కేసులకు గాను 3354 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3599గా ఉంది. ఇదిలావుంటే జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. చిత్తూరు 284, ప్రకాశం 83, అనంతపురం 506, కడప 246, కర్నూల్ 528, నెల్లూరు 224, గుంటూరు 256, కృష్ణ 559, పశ్చిమ గోదావరి 440, తూర్పు గోదావరి 258, విశాఖపట్నం 126, విజయనగరం 53, శ్రీకాకుళం 36 కేసులు ఉన్నాయి.




Tags:    

Similar News