విశాఖలోని స్కూల్స్‌లో కరోనా కలకలం!
కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఏడు నెలల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఇవే పాఠశాలలు వైరస్‌కు కేంద్రాలుగా మారుతున్నాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఏడు నెలల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఇవే పాఠశాలలు వైరస్‌కు కేంద్రాలుగా మారుతున్నాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖ, గుంటూరు, చిత్తూరులో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు ఈ పరిస్థితుల్లో స్కూల్స్ ప్రారంభం కరెక్టేనా అనే ప్రశ్న వినిపిస్తోంది.
సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. అయితే పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు కూడ గడవక ముందే విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఒక్క విశాఖలోనే 50కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్స్ సిబ్బంది కూడా పెద్దగా బాధ్యత తీసుకోకపోవడంతో పిల్లలను స్కూల్స్‌కు పంపాలా..? వద్దా..? అనే ఆలోచనలో పడ్డారు.
విశాఖ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ కాకుండా దాదాపు 400 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అటు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కు కొవిడ్ గైడ్‌లైన్స్ ఇచ్చినా వాస్తవానికి నిబంధనలు అమలు చేసే వసతుల కల్పన లేదు. అటు వైద్యులు కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లలను పాఠశాలలకు పంపకపోవడమే మంచిది అని అంటున్నారు. అంతేకాదు పిల్లలు ఇంట్లో ఉన్నా జాగ్రత్తలు తప్పనిసరంటూ హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి నెమ్మదించినా.. వైరస్ వ్యాప్తి మాత్రం నియంత్రణలోనికి రాలేదు. అటు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటు వ్యాక్సిన్ వచ్చే వరకు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
ఏదీ ఏమైనా.. కరోనా పూర్తి నియంత్రణ జరిగే వరకు.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు పాఠశాలల ప్రారంభమై పునరాలోచన చేస్తేనే మంచిది అని పలువురు కోరుతున్నారు.