Corona Vaccination: ఏపీలో వ్యాక్సినేషన్ పునఃప్రారంభం
Corona Vaccination: ఏపీలో నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది.
Corona Vaccination: ఏపీలో నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. వారం రోజుల నుంచి బ్రేక్ పడిన టీకా పంపిణీని నేటి నుంచి తిరిగి ప్రారంభిస్తోంది ప్రభుత్వం. అయితే 3 రోజులపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుండగా హై రిస్క్ కేటగిరీకి చెందిన 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.
ఆర్టీసీ, బ్యాంకింగ్, పోర్టుల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు, ప్రజా పంపిణీ వ్యవస్థ సిబ్బంది, జర్నలిస్టులను హైరిస్క్ కేటగిరీగా గుర్తించింది ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 13 లక్షల 13 వేల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో లక్షా 55 వేల కోవాగ్జిన్ టీకాలను రెండో డోసు కింద, 11 లక్షల 58 వేల కొవిషీల్డ్ టీకాలను మొదటి డోసుగా ఇవ్వనున్నారు. టీకాల కొరతతో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ లేదని స్పష్టం చేశారు.