AP: నేటితో ముగియనున్న కర్ఫ్యూ..మరికొన్ని రోజులు పొడిగించే ఛాన్స్
AP: కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
AP: కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నేటితో ముగియనుంది. అయితే ప్రభుత్వం అంక్షలు పొడిగింపు పై సీఎం వైఎస్ జగన్నేడు నిర్ణయం తీసుకొనున్నారు. మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్ పై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని భావిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ మినహాయింపు ఉంది. మరో రెండు వారాలు కూడా ఇవే నిబంధలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఏపీలో కర్ఫ్యూ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా 20వేల దిగువకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కరోనా పాజిటివ్ కేసులు గణణీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ మరికొన్ని రోజులు పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.