సీఎంను కలిసిన కేకే రాజు.. గంటా ఎఫెక్టా!

‘కేకే.. హౌ ఆర్‌ యూ.. అంతా ఓకే కదా...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ..

Update: 2020-10-09 04:08 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో ప్రవేశానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఏ క్షణాన అయినా వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. గంటా వైసీపీలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో విశాఖ ఉత్తరం నియోజకవర్గ ఇంచార్జ్ కేకే రాజు గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి విజయవాడ వచ్చారు. అయితే అనివార్య కారణాల వలన కేకే రాజు సీఎంతో ఎక్కువ సమయం భేటీ కుదరలేదని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో గురువారం నిర్వహించిన 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేకే రాజు ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. అయితే ఆయనకు సీఎంతో మాట్లాడానికి కుదరలేదు..

కానీ ఈ సందర్భంగా కేకే రాజుని సీఎం ఆత్మీయంగా పలకరించారు. 'కేకే.. హౌ ఆర్‌ యూ.. అంతా ఓకే కదా...' అంటూ కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి కేకే రాజు సీఎం వద్దకు వచ్చింది.. త్వరలో గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తున్నారన్న వార్తల నేపధ్యలో తన భవిశ్యత్ పై స్పష్టత తీసుకోవడానికే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీలో గంటా చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆయన చేరికకు మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి లు వ్యతిరేకిస్తున్నారు. అందువల్లే గంటా చేరిక ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా కేకే రాజు జగన్ ను కలవడంతో గంటాకు లైన్ క్లియర్ అయిందనే వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News