గాన గంధర్వుడికి 'భారతరత్న' ఇవ్వండి : ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి యావత్ సంగీతాభిమానులను కలచివేసింది. శనివారం ఆయన అంత్యక్రియలు..
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి యావత్ సంగీతాభిమానులను కలచివేసింది. శనివారం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి. అయితే బాలు మరణాంతరం ఆయన స్మారకాన్ని ఏర్పాటు చెయ్యాలని పలు రాజకీయ పార్టీలనుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ తరుణంలో బాలసుబ్రహ్మణ్యంకు ఏకంగా 'భారతరత్న' ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయాన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. 45 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. అంతేకాదు దాదాపు 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.