మంచి మనసును చాటుకున్నా సీఎం జగన్ తల్లి.. వారిని ఆదుకోవాలని మంత్రికి ఫోన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన మంచి మనసును చాటుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన మంచి మనసును చాటుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్ సమీపంలో వున్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు కర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న పురోహితులు జనం రాకపోవడంతో ఉపాధి కరువైంది. దీంతో వారు అనేక అవస్థలు పడుతున్నారు దీనిపై విజయమ్మ స్పందించారు.
లాక్‌డౌన్ వల్ల పురోహితులు ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి చివరికి పుట గడవటమే కష్టంగా ఉంది. ఈ విషయం వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దృష్టికి వెళ్లింది. మానవత్వంతో ఆమె స్పందించింది.
ఈ విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడారు. పురోహితులను ఆదుకోవాలని మంత్రిని విజయమ్మ కోరారు. ఆమె సూచన మేరకు మంత్రి వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు.