నాన్నే నా తొలి స్నేహితుడు: వైఎస్ జగన్

జూన్ 21న ఫాద‌ర్స్ డే ను పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు..

Update: 2020-06-21 12:55 GMT
YSR, Ys Jagan (File Photo)

జూన్ 21న ఫాద‌ర్స్ డే ను పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. త‌న విజ‌యం వెనుక నాన్న ఉన్నార‌ని, నాన్నే నాకు స్ఫూర్తి అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.

'నాన్నే నా బలం, నాన్నే నా ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో ఆయనే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు' అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా తన తండ్రి వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ సంచలనాత్మక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. గత ఐదేళ్లు ప్రతిపక్షనేతగా నేడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Tags:    

Similar News