CM Jagan: అంగన్వాడీల పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలి
CM Jagan: అంగన్వాడీల పనితీరులో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారుసీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాయలంలో రాష్ట్రంలో అంగన్వాడీల పనితీరు, గర్భిణులు, బాలింతకు అందుతున్న పౌష్టికాహారం, విలేజ్ క్లీనిక్ ల పనితీరు, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వాధర్యంలో చేపడుతున్న చర్యలు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనతరం సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీల రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్‌వైజర్లతోపాటు, మిగతా ఖాళీలు వెంటనే భర్తీ చేయాలన్నారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలన్నారు.
అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టిపెట్టడంతోపాటు.. నాడునేడు ద్వారా సొంతభవనాలు నిర్మిచాలన్నారు. డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్ చేపట్టనున్ననేపథ్యంలో స్కూళ్లకు, అంగన్‌వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణ పెంచాలన్నారు. అలాగే బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విలేజ్ క్లీనిక్ లు, ఆశావర్కర్లు పనితీరుపై అధికారులు దృష్టి సారించాలన్నారు.