ఏపీలో వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan Review: ఆయా జిల్లా కలెక్టర్లు అధికారులతో మాట్లాడిన జగన్
CM Jagan Review: గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో బాగంగా ఆయా జిల్లాల కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. వరద సహాయక చర్యలను గురతించి అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలు, మౌలిక వసతుల కల్పపై అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వరదలతో రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు.
మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరిన్ని సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఇక వరద బాధిత కుటుంబాలకు2వేలు, వ్యక్తులకు వేయి చొప్పున పంపిణీ చేయాలన్నారు. అలాగే వరదలపై ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని అధికారులు సీఎం ఈసందర్భంగా ఆదేశాలుజారీ చేశారు.