CM Jagan: రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం

Update: 2021-09-07 02:01 GMT

సీఎం జగన్ సమీక్ష సమావేశం (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ రోడ్ల పరిస్థితిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ జనసేన, టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో అధికారులకు జగన్ కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నంటినీ బాగు చేయాలన్నారు.

రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచామన్న జగన్.. మిగిలిన చోట్ల కూడా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో కొత్త రోడ్లకు నిర్మాణానికి కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, వాటి ద్వారా సరుకురవాణా తదితర అంశాలపైనా సీఎం చర్చించారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, పోర్టుల అభివృద్ధి పై సీఎం సమీక్షించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని అకోబ్టర్ 1 నుంచి ప్రారంభిస్తామన్నారు. తొలివిడతలో 2వేల 647 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక మచిలీపట్నం పోర్టుకు సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, 30 నెలల్లోగా పనులు పూర్తిచేస్తామన్నారు అధికారులు.

Tags:    

Similar News