CM Jagan Review Meeting: వారం రోజుల్లో నష్టాలపై అంచనాలు ఇవ్వండి.. అధికారులకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం!

CM Jagan Review Meeting: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడతెరిపి లేని వర్షాల వ‌ల్ల తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి.

Update: 2020-10-14 09:08 GMT

CM Jagan Review Meeting: వారం రోజుల్లో నష్టాలపై అంచనాలు ఇవ్వండి.. అధికారులకు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం!

CM Jagan Review Meeting: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడతెరిపి లేని వర్షాల వ‌ల్ల తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. ప‌లు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం  అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు

 వాయుగుండం నిన్ననే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, మరో 24 గంటల పాటు ప్రభావం ఉంటుంద‌నీ, కాబ‌ట్టిగుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అలాగే సీజ‌న‌ల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.

బాధిత కుటుంబాల‌కు వెంటనే న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో వారం రోజుల్లో నష్టంపై అంచనాలు చేయాల‌ని అన్నారు. నిర్వాసితుల‌కు ప‌క్కా ఇళ్లు నిర్మించాల‌ని అధికారులకు తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోందనీ, శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదలని అధికారులకు సూచించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది కాబట్టి, అవసరమైన ఆధునీకరణ చేపట్టండండి ఆదేశించారు.

ఇత‌ర అంశాలు

– రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు రిజర్వాయర్లు నింపడం, అక్కడనుంచి కాలువల ద్వారా ప్రతి చెరువులు నింపడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ మేరకు స‌రైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి.

– చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

– కురిసే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టడం, తద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. తద్వారా కరువు నివారణలో శాశ్వత పరిష్కారం చూడాలి.

– కలుషిత నీరు లేకుండా మంచి తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధుల ప్రబలకుండా తగిన చ‌ర్య‌లు తీసుకోవాలి.

– ఆ మేరకు అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్‌ కూడా చేయాలి.

– వరదలు తగ్గాక పాము కాట్లు జరుగుతాయి కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News