పశువుల యూనిట్ల పంపిణీ, అమూల్ కార్యకలాపాలను సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తొలి విడతలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 4వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. లీటర్‌కు 5 నుంచి 7 రూపాయలు అధిక ఆదాయం పాడిరైతులకు లభిస్తుందని తెలిపారు. అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను రైతులకే బోనస్‌గా అందిస్తామన్నారు. దశలవారీగా 6551 కోట్ల వ్యయంతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.