YSR Yantra Seva Scheme: వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభం
*3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ
YSR Yantra Seva Scheme: ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామన్నారు ఏపీ సీఎం జగన్. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద YSR యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు.
రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు 5వేల 262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమచేశారు.