ఏపీ వైద్యారోగ్య చరిత్రలో నూతన అధ్యాయం.. 1,088 అంబులెన్స్‌లకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2020-07-01 04:25 GMT

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ చరిత్రలో ఈరోజు నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. 201కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక 108, 104 వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష జనాభాకు ఒక వాహనం మాత్రమే ఉండగా, ఇకనుంచి 50వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది.

ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News