Andhra Pradesh: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది- జగన్
Andhra Pradesh: ఏపీలో కొవిడ్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh: ఏపీలో కొవిడ్ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని జగన్ ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని జగన్ సూచించారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సూచించారు.