Andhra Pradesh: ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్ సర్వే

* ఏరియల్‌ సర్వేకు ముందు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

Update: 2021-11-20 01:23 GMT

సీఎం జగన్‌ ఏరియల్ సర్వే(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు జగన్ వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

ఇక ఏపీలో వరద పరిస్థితులపై సీఎం జగన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. 5 జిల్లాల్లోని వర్షాల పరిస్థితులను, ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీకి సీఎం వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News