Visakhapatnam: కేకే లైన్‌లో విరిగిపడ్డ కొండ చరియలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
Visakhapatnam: కిరందొల్ నుండి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలిపివేత
Visakhapatnam: ఉమ్మడి విశాఖ జిల్లా కేకే లైన్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ళు రైల్వే ట్రాక్‌పై పడడంతో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండోల్ నుండి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టారు.