Andhra Pradesh: కుప్పంలో విగ్రహాల ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

Andhra Pradesh: చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యం స్వామి దేవుడి విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.

Update: 2021-04-07 14:33 GMT

Andhra Pradesh: కుప్పంలో విగ్రహాల ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

Andhra Pradesh: చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యం స్వామి దేవుడి విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. ఓ మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌. విగ్రహాల ధ్వంసం సమయంలో మహిళ చేతికి గాయం కూడా అయినట్లు గుర్తించామని అన్నారు.

కల్లు తాగిన మైకంలో ఘటనకు పాల్పడిందని చెప్పారు ఎస్పీ. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు.

Tags:    

Similar News