Chandrababu: ఉమా నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన బాబు
Chandrababu: దేవినేనితో పాటు కేసులు నమోదైన కార్యకర్తల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ
Chandrababu: విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకపక్కన అక్రమ మైనింగ్ పై టీడీపీ నిజనిర్దారణ కమిటీ పరిశీలన.. మరోవైపు.. దేవినేని ఉమా కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శతో బెజవాడ అట్టుకుడికింది. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై టీడీపీ నిజనిర్దారణ కమిటీ ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. పదిమందితో కలిపి నిజనిర్దారణ కమిటీని అధినేత చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారు. కమిటీ సభ్యులైన తంగిరాల సౌమ్య, నాగుల్ మీరాలను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్‌బాబు ఎక్కడికక్కడ గృహంలో నిర్బంధించారు. భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు.. దేవినేని ఉమ నివాసానికి చంద్రబాబు వెళ్లి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేవినేని నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి బాబు నివాళులర్పించారు. దేవినేనితో పాటు కేసులు నమోదైన కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు.. ఈ సమయంలో దేవినేని నివాసం దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఉమ కొండపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.. ఆ సమయంలో ఆయనను అడ్డుకున్నారు. పర్యటన అనంతర ఘర్షణల్లో ఉమ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారి కుటుంబ సభ్యులకు బాబు ధైర్యం చెప్పారు..
కొండపల్లి ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.. అడుగడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎట్టిపరిస్థితుల్లోనైనా కొండపల్లి సందర్శించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. కొండపల్లి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో వంగలపూడి అనిత వెళ్లారు.. బస్టాండ్ నుంచి బైక్ మీద టీడీపీ స్థానిక పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు.