Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం రావడం ఓ చరిత్ర
Chandrababu: వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
Chandrababu: వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్ధిక సహాయాన్ని బుధవారం సీఎం అందించారు. ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో అందరూ ఒక్కటై పనిచేశామన్నారు. వర్షం నీరు ఒకవైపు వస్తున్న సమయంలో మరోవైపు బుడమేరు పోటెత్తినా అధికారులతో కలిసి తాను బురదలో దిగి సహాయక చర్యలు చేపట్టినట్టుగా ఆయన చెప్పారు. వరద బాధితులను ఆదుకున్నామని ఆయన తెలిపారు.
విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. బాధితుల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తామని ఆయన చెప్పారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులను ఈ నెలాఖరులోపుగా చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వరదలతో రాష్ట్రంలో 1,12, 345 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 22 రకాల పంటలకు రూ.278 కోట్లను పరిహారంగా అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. వరదల్లో చనిపోయిన 74 మందికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నారు. వరదలతో 1,18,070 ఇల్లు దెబ్బతిన్నాయి. వీటి రిపేర్ల కోసం రూ. 215 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.