Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జల సంఘం కీలక సమావేశం

Polavaram Project: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారుల భేటీ

Update: 2022-02-22 06:30 GMT

పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జల సంఘం కీలక సమావేశం 

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు జల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు భేటీ అయ్యారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, సీఈ సుధాకర్ హాజరయ్యారు. సవరించిన అంచనాలు, డిజైన్ల ఆమోదం, తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు పూర్తి చేయడం, దాని వల్ల ఒనగూరే ప్రయోనాలపై సమీక్షిస్తారు. రెండవ దశలో 45.72 మీటర్ల వరకు కాంటూర్ చేయడం ద్వారా ప్రాజెక్టు ను సంపూర్ణంగా పూర్తి చేయడంపై చర్చిస్తారు.

Tags:    

Similar News